సాక్షి, నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా నల్లగొండలోని మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి సంచలన విమర్శలు చేశారు. డబ్బులు చేతిలో పట్టుకుని వచ్చే వారితో జాగ్రత్త అని హెచ్చరించారు. అలగే, ఎన్నికలు ముగిసేలోపు మునుగోడు మరోసారి వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇక, బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కరెంట్ కోసం కర్ణాటకలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా వేయండి. దేశంలోనే పింఛన్లను పెంచిందే కేసీఆర్. పింఛన్లను ఐదు వేలకు పెంచుతాం. రైతు బీమా కల్పిస్తాం. మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. రేషన్ కార్డుదారులకు అందరికీ సన్న బియ్యం అందిస్తాం.
ఏమాయనే నల్లగొండ అనే పాట నేనే రాశాను. మునుగోడు ప్రజలు చైతన్యంతో ఓటు వేయాలి. డబ్బులు పట్టుకుని వచ్చేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నిన్న ఒక పార్టీ రేపు ఇంకో పార్టీ అని డబ్బు మదంతో ప్రవర్తించే వాళ్లకు బుద్ధి చెప్పాలి. పాలమూరు పూర్తి కావస్తోంది. డిండి ప్రాజెక్టు ద్వారా శివన్న గూడెంకు నీళ్లు అందిస్తాం. ఏడాది కాలంలో రెండు లక్షల ఎకరాలకు నీటిని అందిస్తాం. కాంగ్రెస్ వస్తే కరెంట్ సమస్యలు కర్ణాటకలో ఎలా సమస్య అవుతుందో అలా అవుతుంది. ఉప ఎన్నికల్లో చూపిన చైతన్యాన్ని చూపించి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి.
మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం చండూర్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నాం. వంద పడకల ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలించినా ఫ్లోరైడ్‌ను అరికట్టేందుకు ఏనాడు ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు మనతో ఉన్నారో లేరో మీకు తెలుసు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు.
అంతకుముందు వనపర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ వచ్చింది. వలసల వనపర్తిని వరిపంటల వనపర్తి చేసిన మొనగాడు కావాలా.. మరొకరు కావాల్నో తేల్చుకోవాలె. నిరంజన్ రెడ్డి నీళ్ల కోసం కృషి చేసిండు. ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ధరణి వల్ల సమాజం శాంతిగా ఉంది. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్.. 18 మందికి సీటు దక్కేనా?
Comments
Please login to add a commentAdd a comment