సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్య క్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలనే నిర్ణయాన్ని ప్రజలు క్షమించ రని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంటే కాంగ్రెస్‌కు కంటగింపు ఎందుకని ప్రశ్నించారు.
గురువారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడు తూ అభద్రతాభావంతో, కుహనాలౌకికవాదంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ హిందుత్వ వ్యతిరేక వైఖరిని చా టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు, బుజ్జగింపు, మతతత్వ రాజకీయాల కోసం, తమ దుర్మార్గపు ఆ లోచనల పరంపరలో భాగంగానే అయోధ్యకు వచ్చేది లేదంటూ కాంగ్రెస్ రాజకీయ దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసు కుందన్నారు.
రాముడి ఉనికినే కొట్టివేసిన చరిత్ర కాంగ్రెస్‌దని, బహిష్కరించడం ఆ పార్టీకి అలవాటయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నా యకత్వంతో కాంగ్రెస్ పార్టీ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, హిందువుల జీవన విధానంపై ఏమాత్రం గౌర వం లేకుండా వ్యతిరేకంగా మాట్లాడుతోందని నిందించారు.
మజ్లిస్ మెప్పు పొందేందుకే హిందువులపై కేసులు
పార్లమెంట్, జీ–20, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించిందని దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి? పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వారం రోజుల తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ మెప్పు పొందేలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
కాంగ్రెస్‌కు ముందుంది ముసళ్ల పండుగ
ప్రస్తుతం కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లకే పరిమితమైందని, ఇంకా ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 22న శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా.. అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులు, సాధుసంత్‌లు, సామాజిక సంస్థలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారని చెప్పారు.
ఈ ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాం«దీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అ«దీర్ రంజన్ చౌదరిలను ట్రస్టు ఆహ్వానించిందని కిషన్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment