![Sajjala Rama Krishna Reddy Key Comments On CBN And Pawan - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/21/sajjal.jpg.webp?itok=jitY3j40)
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాకపోతే తమ మీటింగ్‌కి జనం రారనుకునే స్థితికి చంద్రబాబు వెళ్లారని అన్నారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మనుషులంటే ప్రేమ, వారి కష్టాలపై సానుభూతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని కామెంట్స్ చేశారు.
కాగా, సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం జగన్ అహంకారి అయితే ప్రజల మనసులో ఎలా ఉంటారు?. అందుకే ఈ నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ సంక్షేమం చేయగలిగారు. చంద్రబాబు పాలనలో ఏం చేశారో చెప్పాలి?. దానికి అహంకారం అనే పేరు టీడీపీ వారు ఎలా పెడతారు?. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 2014-19 మధ్య చంద్రబాబు తెచ్చిన స్కీములు ఉన్నాయా?. చంద్రబాబు, పవన్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడు ఎందుకు వచ్చింది?. ఇప్పుడు ఎందుకు మళ్లీ కలిశారో ప్రజలకు చెప్పాలి. వారి మధ్య తెరవెనుక జరిగిన ఒప్పందాలను ప్రజలకు వివరించాలి.
ఎల్లో మీడియా ప్లాన్ అదే..
చంద్రబాబు కొత్తపార్టీ తరహాలో ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. జన్మభూమి కమిటీ పేరు వినగానే జనానికి భయం పుడుతుంది. రామోజీ, రాధాకృష్ణ వంటి వారు మాత్రమే త్వరగా చంద్రబాబు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. వస్తే మళ్లీ దోపిడీకి తెగపడవచ్చన్నది వారి ప్లాన్. కానీ, సాధారణ ప్రజలు ఎవరూ సీఎం జగన్‌ను మార్చాలని అనుకోవడం లేదు. చంద్రబాబుకు దీర్ఘకాలిక మద్దతు అని పవన్ అంటున్నారు. మరి సొంతంగా పార్టీ పెట్టుకోవడం ఎందుకు?. పవన్ వెనుక ఉన్న వారు చంద్రబాబుని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారు?.
టీడీపీ, జనసేన మధ్య పొంతనలేదు..
పవన్, చంద్రబాబుకు ఏపీలో అడ్రస్ లేదు. వారికి సపోర్టు చేసే మీడియా అధినేతలు కూడా వేరే రాష్ట్రంలో కూర్చుని రాళ్లు వేస్తున్నారు. మా హయాంలో సచివాలయాల ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ఇచ్చినవి ఉద్యోగాలు కావా?. ఆరున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినవి కనపడం లేదా?. చంద్రబాబు హయాంలో 30వేల కంటే ఉద్యోగాలు ఇచ్చారా?. కొత్త ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున వస్తేంటే కనపడటం లేదా?. చంద్రబాబు హయాంలో ఏం జరిగాయో చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదు?. అధికారం ఒక హక్కు అని ఇంకా చంద్రబాబు అనుకుంటున్నారు.
టీడీపీని లాక్కున్నారు, పవన్‌కి ఎదురు డబ్బు ఇచ్చి తెచ్చుకున్నారు. అది తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పలేరు. మా పార్టీ నుంచి ఎవరూ పక్కకు వెళ్లే అవకాశం లేదు. టీడీపీ, జనసేన మధ్యే సరిగా పొంతనలేదు. ఇక బీజేపీని కలపాలని ఎందుకు అనుకుంటారు?’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment