సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను చంద్రబాబు, పవన్ విస్మరించారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.
అవతరణ దినోత్సవాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కార్
ఏపీ అవతరణ దినోత్సవాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని చంద్రబాబు అవమానించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. చంద్రబాబు సీఎం కాగానే అవతరణ దినోత్సవానికి మంగళం పాడారు. 2014-19లోనూ అవతరణ దినోత్సవాన్ని చంద్రబాబు జరపలేదు.
వైఎస్సార్‌సీపీ నిర్వహించిన అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో మన రాష్ట్రం ఏర్పడిందని.. 1956 నుండి మన రాష్ట్రానికి నవంబర్ 1న అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 2014లో చంద్రబాబు దుర్మార్గంగా పొట్టి శ్రీరాములును అవహేళన చేశారు. 5 ఏళ్ళు అవతరణ దినోత్సవం చంద్రబాబు జరపలేదు. పొట్టి శ్రీరాములును చంద్రబాబు అవమానించారని ఆయన మండిపడ్డారు.
వైఎస్ జగన్ సీఎం అయ్యాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించారు. గత ఐదేళ్లు అవతరణ దినోత్సవం వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిపారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అవతరణ దినోత్సవం జరపలేదు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం పొట్టి శ్రీరాములుకి నివాళులు కూడా అర్పించలేదు. మన రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేకుండా చేయడం దుర్మార్గం. గతంలో వైఎస్సార్ నెల్లూరుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. ఆర్యవైశులకు వైఎస్ జగన్ మంచి అవకాశాలు ఇచ్చారు.’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.
టీటీడీ బోర్డులో ఒక్క ఆర్యవైశ్యునికి కూడా అవకాశం ఇవ్వలేదు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిపించాల్సిందే. దీనికోసం అవసరమైతే ఉద్యమం చేపడతాం. చంద్రబాబు టీటీడీలో పనికిమాలిన వాళ్లని, కేసులు ఉన్నవారిని నియమించారు. రామోజీరావు సంతాప సభ కోట్లు పెట్టి చేశారు కానీ, పొట్టి శ్రీరాములుకి నివాళులు అర్పించడానికి మీ ఆలోచన రాదా?. వైఎస్ జగన్ హయాంలో ప్రతి జిల్లాలోనూ అవతరణ దినోత్సవం నిర్వహించేవాళ్లం’’ వెల్లంపల్లి పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే: మల్లాది విష్ణు
పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం 56 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ విస్మరించడం దారుణం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పొట్టి శ్రీ రాములును కించపరచడం దారుణం. టీటీడీ బోర్డులో ఆర్యవైశ్యులకు, బ్రాహ్మణులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా మోసం చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరిని చంద్రబాబు అవమానించారు.
Comments
Please login to add a commentAdd a comment