కాంగ్రెస్‌లో కటౌట్ లొల్లి !
సిరిసిల్లటౌన్: అధికార పార్టీలోని నేతలు తమ గుర్తింపు చాటుకునేందుకు ఆరాట పడడం సహజమే. ఇందులో భాగంగానే ఎల్లారెడ్డిపేటకు చెందిన కాంగ్రెస్ నేత నేవూరి వెంకట్‌రెడ్డి లక్షలు వెచ్చించి సిరిసిల్లలో ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేయించారు. దాదాపు 50 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌లతోపాటు తన ఫొటోను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో ఎలాంటి పదవి లేని సదరు నాయకుడు కనీసం ప్రొటోకాల్ సైతం పాటించలేదన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఫొటోలు లేకుండా కటౌట్ ఏర్పాటు చేశారని సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్ చుట్టూ చర్చలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment