అమిత్‌షా వ్యాఖ్యలపై ఆగ్రహం
● దిష్టిబొమ్మ దహనానికి యత్నం ● అడ్డుకున్న పోలీసులు
సిరిసిల్లటౌన్: పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై వామపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం ధర్నా చేపట్టారు. అమిత్‌షా దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వక్తలు మాట్లాడుతూ రాజ్యసభలో అంబేడ్కర్‌ను అవమానపరిచేలా అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, శ్రీరామ్ రమేశ్‌చంద్ర, దాసరి రూప, తన్నీరు లక్ష్మీనారాయణ, మిట్టపల్లి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment