అర్హులకు ఇళ్లు ఇవ్వాలి
సుందరయ్యనగర్‌లోని చాలా మంది నిరుపేదలకు సొంత ఇళ్లు లేవు. గత ప్రభుత్వ హయాంలో వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు రాలేదు. నాగుల గంగాభవాని, పల్లపు పద్మ, బండారి లావణ్య, నాగుల రాధ ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయించి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలి.
– దుబాల వెంకటేశం, ఏఎంసీ డైరెక్టర్, సిరిసిల్ల
సబ్సిడీ డబ్బులు వాడుకున్నారు
గత ప్రభుత్వ హయాంలో నేసిన బతుకమ్మ చీరలు, ఆర్‌వీఎం సూటింగ్స్, షర్టింగ్స్ సబ్సిడీ డబ్బులు ఆసాములకు రావాల్సి ఉంది. శ్రీనివాస సొసైటీ మ్యాక్స్ సంఘం ద్వారా వస్త్రాలు ఉత్పత్తి చేశాం. వాటికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను సొసైటీలోనే 25శాతం మందికి మాత్రమే ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి.
– మేర్గు శ్రీనివాస్, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment