సింగిల్‌విండో సేవలు భేష్
● సతారా సొసైటీ చైర్మన్ వీకే మోతె
ముస్తాబాద్(సిరిసిల్ల): పోతుగల్ సింగిల్‌విండో సేవలు బాగున్నాయని మహారాష్ట్రలోని సతారా వికాస్ సొసైటీ చైర్మన్ మోతె అభినందించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ సొసైటీని శుక్రవారం సందర్శించారు. రైతులకు అందిస్తున్న పంటరుణాలు, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలతోపాటు బంగారం, ఇళ్లపై రుణాల వివరాలు తెలుసుకున్నారు. పెట్రోల్ బంకుల పనితీరు, గోదాంల ద్వారా ఎరువులు, విత్తనాల పంపిణీ, ఏటీఎంల ద్వారా నగదు అందజేత, డ్రోన్‌ల ద్వారా మందుల పిచికారీ, రైతులకు అందిస్తున్న రుణాలపై సీఈవో కృష్ణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment