‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆసరా పెన్షన్లు పెంచాలని కోరుతూ ఈ నెల 26న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కరంటోత్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెన్షన్లు పెంచాలని కోరుతూ వీహెచ్ఎస్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ ముట్టడికి దివ్యాంగులంతా హాజరవ్వాలని పిలుపునిచ్చారు.
వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment