ఇంటి నుంచి వెళ్లిన బాలుడి అదృశ్యం
తాండూరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత తాండూరు గడి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫేరోజ్ కుమారుడు మహ్మద్ సమీర్(14) స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు సెలవు కావడంతో మధ్యాహ్నం మజీదులో ప్రార్థన చేసి బయట కొద్ది సేపు కూర్చున్నాడు. రాత్రి అయినా సమీర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ఇళ్లల్లో వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడు సాయంత్రం రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కనిపించాడని, అతని కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment