చట్టాలపై అవగాహన కల్పించాలి
ఆమనగల్లు: గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన కల్పించాలని, అప్పుడే వారికి సత్వరన్యాయం పొందడానికి వీలుంటుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం మండల పరిధి కోనాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది, ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు యాదీలాల్ రూపొందించిన నూతన సంవత్సర కేలెండర్, డైరీలను నగరంలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ప్రజా చైతన్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో న్యాయవాదులు తమవంతు కృషి చేయా లని సూచించారు. సేవలను బట్టే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ను యాదీలాల్ సన్మానించారు.
ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్
Comments
Please login to add a commentAdd a comment