బీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు
చేవెళ్ల: బీఆర్‌ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని, పార్టీని వీడే ఆలోచన కానీ అవసరం కానీ లేదన్నారు. సబితమ్మ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, సబితారెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కావలి రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బి. నర్సింలు, నాయకులు మాధవ్‌రెడ్డి, రాంప్రసాద్, మల్లేశ్, నరేందర్‌రెడ్డి, తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment