‘పుర’పాలనకు తెర
● ఈనెల 26తో పదవీకాలం పూర్తి ● ఇక ప్రత్యేక అధికారుల పాలనలోకి! ● రిజర్వేషన్ల మార్పుపై చర్చ ● జోరుగా అభివృద్ధి పనులు
నారాయణఖేడ్: మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నా యి. టీయూఎఫ్‌ఐడీసీతోపాటు ఇతర నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల పాలనలోకి మున్సిపాలిటీలు వెళ్లనున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావి స్తోంది. దీంతోపాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం సాగుతుంది. పదవులు అనుభవించిన కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు మళ్లీ బరిలో నిలవాలని యోచిస్తున్నారు.
జిల్లాలో 7 మున్సిపాలిటీలకే ఎన్నికలు
జిల్లా సంగారెడ్డి, సదాశిపేట్, తెల్లాపూర్, జోగిపేట్, నారాయణఖేడ్, అమీన్‌పూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. జహీరాబాద్ మున్సిపాలిటీలో పలు గ్రామాల విలీనంకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది.
రిజర్వేషన్ల మార్పుపై అనుమానాలు
పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తులకు రిజర్వేషన్లు మారుతాయని చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీల రిజర్వేషన్లు అవే ఉంటాయా లేక మారుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట్ బీసీ మహిళకు, జోగిపేట, నారాయణఖేడ్ బీసీ జనరల్‌కు, అమీన్‌పూర్, ఐడీఏ బోల్లారంలు అన్ రిజర్వుడ్, తెల్లాపూర్ జనరల్ మహిళకు కేటాయించారు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు వీటి పరిధిలోని 162 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఎస్టీలకు 7, ఎస్సీలకు 19, బీసీలకు 54, జనరల్ మహిళలకు 46 వార్డులు రిజర్వు అయ్యాయి. మొత్తమ్మీద మహిళలు 78 వార్డులకు ఎన్నికయ్యారు. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు కసరత్తు ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment