అనుమతుల్లేకుంటే మూసివేతే!
● జిల్లాలో జనవరి నుంచి 13 ఆసుపత్రులు సీజ్ ● 44 హాస్పిటల్స్‌కు జరిమానా ● జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి వెల్లడి
హత్నూర(సంగారెడ్డి): అనుమతులు లేకుండా నిర్వహించే ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలను మూసివేస్తామని వాటిపై చర్యలకు ఉపేక్షించేది లేదని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి స్పష్టం చేశారు. మండల కేంద్రమైన హత్నూరలోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్‌తోపాటు ఆర్‌ఎంపీ శ్రీశైలంకు చెందిన జై భవాని క్లినిక్‌ను ఆమె శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టి సీజ్ చేశారు. విజయ డయాగ్నొస్టిక్ సెంటర్‌తోపాటు జై భవాని ఆర్‌ఎంపీ క్లినిక్‌కు కూడా గతంలో నోటీసులు ఇచ్చామని అయినా అనుమతుల్లేకుండా నిర్వహించడంతో ఈ రెండింటినీ సీజ్ చేసినట్లు గాయత్రీదేవి వెల్లడించారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 13 క్లినిక్‌లకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 44 క్లినిక్‌లకు ఇప్పటివరకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. అంతకుముందు మండల కేంద్రమైన హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గాయత్రీదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిధిలో ఏడుగురు గర్భిణులు ఉండగా ఇప్పటికీ నలుగురికి ఆస్పత్రిలోనే ప్రసూతి సేవలు అందించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment