ఇంటింటికీ రక్షిత మంచినీరు
● పురపాలికల అభివృద్ధిపై సమీక్షలో ఎమ్మెల్యే గూడెం ● 21, 22, 23 తేదీలలో ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు
పటాన్‌చెరు: నియోజకవర్గ పరిధిలోని ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 21, 22, 23 తేదీలలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు,కమిషనర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ...ఈ నెలాఖరులో మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో పూర్తిచేసిన అభివృద్ధిపనులను ప్రారంభించడంతో పాటు.. నూతన పనులకు శంకుస్థాపన చేయననున్నామన్నారు. వీటితోపాటు జలమండలి ద్వారా చేపట్టిన నూతన రిజర్వాయర్లను ప్రారంభిస్తామని తెలిపారు. ఆపదకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని చెప్పారు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటకు చెందిన సందీప్ కుమార్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి వైద్యం కోసం మంజూరైన 2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ అనుమతి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామన్నారు. సమీక్షలో అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment