టీఎస్ యూటీఎఫ్ కార్యదర్శి సాయిలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ నాయకులు సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ...ప్రస్తుతం హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్ ఉపాధ్యాయులు, కాలేజీ, యూనివర్సిటీల అధ్యాపకులకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ గతంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళాకు
విశేష స్పందన
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు మంచి స్పందన లభించింది. ఈ జాబ్‌మేళాలో అపర్ణ ఎంటర్ర్‌పైజెస్, జెప్టో, హెటిరో, మెడ్‌ప్లస్, రూపీక్, హావెల్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి 24 కంపెనీలు పాల్గొన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ రత్న ప్రసాద్ తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 147 మంది హాజరు కాగా అందులో వివిధ కంపెనీలలో 91 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా అనేక కంపెనీలతో జాబ్ మేళాను నిర్వహించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీశ్వర్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డాక్టర్ సదయ కుమార్ డాక్టర్ వాణి, డాక్టర్ సుమతి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment