అనాథ పిల్లలకు అండగా నిలుద్దాం
గజ్వేల్‌రూరల్: తల్లిని కోల్పోయి తండ్రికి దూరమైన అనాథ పిల్లలకు అండగా నిలుద్దామని స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పిలుపునిచ్చారు. మండలంలోని బంగ్లావెంకటాపూర్‌కు చెందిన మాస్టి నాగమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, తండ్రి ఆచూకీ లేకపోవడంతో అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను ‘మనం’ ఫౌండేషన్, ఆర్థిక చేయూత ఫౌండేషన్(ఏసీఎఫ్) సభ్యులు గురువారం పరామర్శించి మనోధైర్యం కల్పించారు. రూ.10వేల నగదుతో పాటు 50కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు స్వామి, కనకయ్య, ఆంజనేయులు, కొండల్‌రెడ్డి, మల్లికార్జున్, వెంకటేష్, వెన్నెల స్వామి, మధుబాబు, ఎల్లం రాజు, చింతకింది స్వామి, బాబు, భిక్షపతి, సత్యనారాయణ, రమేష్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment