ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ కూడా అతడిని నిర్ణయాన్ని గౌరవిస్తూ సపోర్ట్‌గా నిలిచింది.
అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లి అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ అని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి లేకపోవడం భారత జట్టుకు నష్టమేమి లేదని, సిరీస్‌ను కూడా కోల్పోదని
"విరాట్ కోహ్లి లేకపోతే భారత్ సిరీస్ కోల్పోతుందని నేను అనుకోను. నిజం చెప్పాలంటే.. ఎవరైనా రావడం లేదా వెళ్లిపోవడం వల్ల జీవితం ఆగిపోదు. ఎవరన్న లేక పోయినా మన జీవితం కొనసాగించాలి. ఆట కూడా అంతే. మన ప్రదర్శనను కంటిన్యూ చేయాలి. కోహ్లి లేకపోవడం గురించి మనం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. ఇదింతా అస్సలు ఎందుకు? అతడి సేవలను జట్టు కోల్పోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు లేకపోతే ఏకంగా సిరీస్‌లో ఓడిపోతుందని అనడం సరికాదు.
గతంలో అతడు ఆసీస్ టూర్(2020-21)కు అందుబాటులో లేకపోయినప్పటికీ భారత్ చారిత్రత్మక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై. వాస్తవానికి కోహ్లి ఆడిన మ్యాచ్‌లోనే భారత్ ఓడిపోయిది. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా కంచు కోట గబ్బాలో కూడా భారత్ విజయం సాధించిందని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!
Comments
Please login to add a commentAdd a comment