అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ జోస్ బట్లర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. భువీ.. బంతిని స్వింగ్ చేస్తూ వేసిన బంతికి బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. టీమిండియా చేసిన అప్పీల్‌కు అంపైర్ అనిల్ కుమార్ చౌదరి ఔట్ ఇచ్చాడు. అయితే దీనికి బట్లర్ రివ్యూకు వెళ్లలేదు. లెగ్ స్టంప్‌కు వెళుతుందని భావించి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ బంతి ఎత్తుపై కాస్త సందేహం ఏర్పడింది. బంతి కచ్చితంగా వికెట్‌పైకి వెళుతుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో కల్గింది. కాగా, బాల్ ట్రాకర్‌లో మాత్రం అవుట్ సైడ్ ఆఫ్ లెగ్‌స్టంప్ పైభాగాన్ని తాకుతున్నట్లు కనబడింది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ఇవ్వకుండా ఒకవేళ రివ్యూకు టీమిండియా వెళితే అప్పుడు అది అంపైర్స్ కాల్ కింద నాటౌట్‌గా ఇచ్చేవారు. కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లినా ఫలితం ఉండకపోయేది.
ఇది టీమిండియా మంచి బ్రేక్ త్రూగానే చెప్పాలి. ఇక బట్లర్ తాను ఆడిన తొలి బంతికే ఔట్ కావడంతో గోల్డెన్‌గా పెవిలియన్‌కు చేరాడు. మరొకవైపు భువీకి 15 నెలల తర్వాత తొలి అంతర్జాతీయ వికెట్ లభించింది.2019, డిసెంబర్ 11వ తేదీన చివరిసారి భువీ అంతర్జాతీయ వికెట్ సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భువీ వికెట్ తీశాడు. అటు తర్వాత గాయాల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో ఘోర ఓటమి పాలైన టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది. తొలి టీ20లో ఓపెనింగ్ భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో టీమిండియా ఒత్తిడికి లోనై వికెట్లను కోల్పోయింది. దాంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది టీమిండియా. దాన్ని రెండో టీ20లో అధిగమించాలని భారత జట్టు యోచిస్తోంది. ఇక్కడ చదవండి: కోహ్లి.. నువ్వు చెప్పింది ఏమిటి.. చేసిందేమిటి?: మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment