స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మరో సమరానికి సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే శుక్రవారం మొహాలీ వేదికగా జరగనుంది. ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంలో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. దక్షిణాఫ్రికా గడ్డపై ఆసీస్ సిరీస్ ఓడింది.
ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. ప్రోటీస్ సిరీస్‌కు దూరమైన స్మిత్, కెప్టెన్ కమ్మిన్స్ భారత్‌తో మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చారు. ఇక వన్డే సిరీస్ నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం.
ఆసీస్‌దే పైచేయి..
వన్డేల్లో భారత్‌పై కంగారూలదే పై చేయి. టీమిండియాపై ఆసీస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 146 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఆస్ట్రేలియా 82 సార్లు విజయం సాధించగా.. కేవలం 54 సార్లు మాత్రమే భారత్ గెలుపొందింది.
స్వదేశంలో కూడా టీమిండియాపై ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. స్వదేశంలో ఆ్రస్టేలియా జట్టుతో ఇప్పటి వరకు భారత్ 67 మ్యాచ్‌లు ఆడింది. 30 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 32 మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
మొహాలీలో ఒక్క మ్యాచ్ కూడా..
ఇక తొలి వన్డే జరగనున్న మొహాలీలో భారత్‌కు చెత్త రికార్డు ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడిపోయింది.
చదవండి: IND vs AUS: పూర్తి స్థాయి జట్టుతో ఆడాల్సింది.. సునీల్ గావస్కర్ కీలక వాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment