వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు (ఐదు మ్యాచ్‌ల సిరీస్) దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. ఆ తర్వాత జరుగబోయే మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తుంది.
చివరి మూడు టెస్ట్‌లకు ఇవాళ టీమిండియాను ప్రకటించాల్సి ఉన్నా విరాట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
ఒకవేళ నిజంగానే కోహ్లి ఇంగ్లండ్‌తో తదుపరి సిరీస్‌కు దూరమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. గాయాల కారణంగా ఇప్పటికే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా సేవలను (రెండో టెస్ట్‌కు) కోల్పోయిన భారత్.. కోహ్లి కూడా దూరమైతే చాలా ఇబ్బంది పడుతుంది.
తొలి టెస్ట్‌లో ఓటమిపాలై సిరీస్‌లో 0-1తో వెనుకపడి ఉన్న భారత్‌కు ఇది సంకటంగా స్థితిగా చెప్పవచ్చు. కోహ్లి, రాహుల్, జడేజాల స్థానాల్లో రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లాంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చినప్పటికీ సీనియర్ల స్థాయి ప్రదర్శన వీరి నుంచి ఆశించలేని పరిస్థితి ఉంది.
ఇన్ని ప్రతికూలతల నడుమ ఇంగ్లండ్‌తో తదుపరి సిరీస్‌లో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు, నాలుగు, ఐదు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటిస్తారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు హైదారాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment