No Headline
అక్రమ రవాణాను అడ్డుకున్న సర్పంచ్, స్థానికులపై దాడి
బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో ఘటన
ఎమ్మెల్యే ఆదేశాలనే ధిక్కరించిన తమ్ముళ్లు
రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా
జిల్లా అంతటా రెచ్చిపోతున్న పచ్చ ముఠాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఊరూరా సహజ వనరులు దోపిడీ నిత్యకృత్యమైంది. ఇసుక, మట్టి, గ్రావెల్‌ను అక్రమ రవాణా సాగిస్తూ వేల రూ.కోట్లు కొల్ల గొట్టారు. ఈ అక్రమ దందాపై జిల్లాలోని ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నోరు మెదపడం లేదు. తెరవెనుక ఉండి.. అక్రమ దందాను నడిపిస్తున్నారనే ప్రచా రం లేకపోలేదు. నా నియోజకవర్గంలో అక్రమ దందాకు తావులేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి బహిరంగంగానే చెబుతున్నా.. ఇక్కడే విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతోంది.
కోవూరులో రెచ్చిపోయిన తమ్మళ్లు
ప్రతిరోజూ జొన్నవాడ సమీపంలో మినగల్లు రీచ్ నుంచి ఇసుక, పెనుబల్లి పొలాల నుంచి మట్టి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ముందు పెట్టి ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షల్లో జేబులునింపుకుంటున్నారు. ఇక్కడి అక్రమ రవాణాపై అధి కారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులే అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. మంగళవారం రాత్రి జొన్నవాడ నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పెనుబల్లి వద్ద సర్పంచ్ పెంచలయ్యతో పాటు వెంకటేశ్వర్లు, సురేష్‌రెడ్డి అడ్డుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ జొన్నవాడలోని తన యజమానికి సమాచారం అందించారు. జొన్నవాడకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రణీత్, ప్రసాద్ మరికొంత మంది పెనుబల్లి వద్దకు చేరుకుని వారిపై ఏకంగా దాడులకు తెగించారు. ట్రాక్టర్‌తో వారిని తొక్కించేందుకు ప్రయత్నించారు.
ఇసుక ఎక్కడి నుంచి వస్తోంది..
జిల్లాలో పెన్నాతీరంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. డంపింగ్ యార్డుల్లో నిల్వలు లేవు. మరి ఇసుక విచ్చలవిడిగా ఎలా బయటకు వస్తోంది. టీడీపీ నా యకులు ఊరూరా ఒక మాఫియాగా తయారయ్యా రు. పెన్నానదిలో ఇసుక తోడేసి అక్రమ రవాణా చేస్తున్నారు. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయ త్నిస్తే ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్ తరలించే వాహనాలతో తొక్కించేందుకు వెనుకాడడం లేదు. కోవూరులో పరిస్థితి ఇలా ఉంటే.. సర్వేపల్లిలో అయితే ఏకంగా కలెక్టర్, ఎస్పీలనే బెదిరించే స్థాయికి చేరారు. ఇంత జరుగుతున్నా.. ఒక ఊరులో ఒక్క కేసైనా నమోదు చేయలేదంటే టీడీపీ నేతలు తాలిబన్లు మాదిరిగా అధికార వ్యవస్థనే శాసిస్తున్నారని స్పష్టమవుతోంది.
110 రోజుల్లో రూ.15 వేల కోట్ల దోపిడీ
సర్వేపల్లి మొదలు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు, కందుకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో సహజవనరుల దోపిడీ ఓ రేంజ్‌లో జరుగుతోందని జిల్లాలో ఉన్నత స్థాయి అధికారి ఒకరు చెప్పారు. ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ రవాణా లెక్క కడితే.. నిత్యం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర జరుగుతోంది. ఈ లెక్కన సగటున టీడీపీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లో సుమారు రూ.15 వేల కోట్ల పైబడి దోచుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment