నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల దరఖాస్తులను జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఈనెల 30లోపు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 38,295 మంది విద్యార్థులుండగా వారిలో 2,513 మంది డిస్కంటిన్యూ చేశారని మిగిలిన వారిలో 24,182 మంది దరఖాస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అలాగే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కోసం 13,549 మంది ఉండగా వారిలో కేవలం 2,337 మంది మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారన్నారు. ప్రిన్సిపల్ లాగిన్‌లో ఇంకా 12,413 మంది ఆధార్ అథెంటిఫికేషన్, 3,907 మందికి ప్రిన్సిపల్ ఓటీఏ, 12,413 మందికి అటెండెన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment