అరాచక పాలనకు నిదర్శనం
●
సాగునీటి సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. బోగోలులో పార్టీకి అతీతంగా ఓ రైతు పోటీకి సిద్ధపడ్డారు. ఈ ఒక్క స్థానంలో కూడా పోటీని ఎదుర్కోలేక టీడీపీ అరాచకానికి తెరతీసింది. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలకు కొద్ది గంటల ముందు, అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న నాయకులను స్టేషన్‌కు తరలించడం దుర్మార్గం. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక ఇంతకు దిగజారడం, పోలీసులను అడ్డు పెట్టుకోవడం సిగ్గు చేటు.
– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment