తవ్వకాల తకరారు!
కూటమి నేతల మధ్య క్వార్ట్ ్జ చిచ్చు.. కార్చిచ్చులా రేగుతోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని సైదాపురం, గూడూరు పరిధిలోని మైకా క్వార్ట్ ్జ గనుల కోసం కొట్టుకునే పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. గనులు లీజు ఉన్నా.. తవ్విన ఖనిజాన్ని తనకే విక్రయించాలంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త, ప్రజాప్రతినిధి హుకుం జారీ చేయడాన్ని మిగతా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో వైపు లీజు దారులంతా ఏకమై ఎవరైతే ఎక్కువ ధర కోట్ చేస్తారో వారికే విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు లీజు దారులంతా శనివారం చిల్లకూరులో రహస్యంగా సమావేశమై చర్చించుకున్న విషయం తెలిసిందే.
సాక్షి టాస్క్‌ఫోర్స్: నెల్లూరు జిల్లా సైదాపురంలోని అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు పోటీ పడుతూ.. ఏకంగా కొట్లాటలతో బజారున పడుతున్నారు. సైదాపురంలో ఏడు భూగర్భ గనులు, 140 మైకా క్వార్ట్ ్జ గనులున్నాయి. మరో వందేళ్ల వరకు ఇక్కడ ఖనిజ నిక్షేపాలకు కొదవ ఉండదని నిపుణులు చెబుతున్నారు. వీటి ఆధారిత పరిశ్రమలు వందకుపైగా నడుస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో లభించే ఖనిజాన్ని చైనా, జపాన్, రష్యా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. గతంలో మైకా క్వార్ట్ ్జకు అంతంత మాత్రమే ధర ఉండేది. 8 నెలలుగా మైకా క్వార్ట్ ్జకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చైనాలోని సెమీ కండక్టర్ పరిశ్రమల్లో మైకా వినియోగిస్తున్నారు. దీంతో మంచి అవకాశం వచ్చిందని గనుల వ్యాపారులు సంబర పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. అధికారం చేపట్టిన వెంటనే తవ్వకాలు, ఎగుమతులను నిలిపివేసింది. ‘ముఖ్య’ నేత అనుచరుడికి చెందిన ఓ గని, బాలకృష్ణ బంధువుకు చెందిన మరొక గనిలో మాత్రమే తవ్వకాలు, ఎగుమతులకు అవకాశం కల్పించింది. ఆరు నెలల తర్వాత, తొమ్మిది గనులకు అనుమతులు మంజూరు చేసింది. తాజాగా మరో 11 గనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మైకా క్వార్ట్ ్జ కోసం విదేశీయులు వచ్చి వెళ్తున్న విషయం తెలుసుకున్న నెల్లూరుకు చెందిన టీడీపీ నేత రూప్‌కుమార్‌యాదవ్, మరి కొందరు ఇటీవలే చైనా పర్యటన చేపట్టారు. కొద్ది రోజులు అక్కడే తిష్టవేసి విదేశీయులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
దాడులు, దౌర్జన్యాలు
తెల్లరాయికి చైనాలో మంచి డిమాండ్ ఉండడంతో మైకా గనులపై కూటమి నేతల కన్నేశారు. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నేతలతోపాటు, నెల్లూరు జిల్లాకు చెందిన కూటమి నేతలు కూడా గనుల కేటాయింపులు తమకే కావాలని పట్టుబడుతున్నారు. మైకా గనులు, సిలికాను దక్కించుకునేందుకు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. ఖనిజానికి స్థానికంగానే రూ.25 వేల నుంచి రూ.2 లక్షలకు ధర పలుకుతుండడంతో ఈ గనులను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు వ్యాపారులను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు పథకం వేశారు. తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నెల్లూరుకు చెందిన బడా పారిశ్రామికవేత్త అయిన ఓ ప్రజాప్రతినిధికి బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ నాయకుడిని రంగంలోకి దింపినట్లు సమాచారం. పత్రి నెలా రూ.30 కోట్లు కప్పం చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గనులన్నింటినీ సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. అధికారుల ద్వారా లైసెన్స్ దారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. బెదిరింపులకు లొంగని వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల సైదాపుంరలోని ఓ మైకా గనిలోని నెల్లూరు జిల్లాకు చెందిన పచ్చమూక చొరబడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలకు అధికారులు వంత పాడుతున్నారని, గనులు సరెండర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఓ వ్యాపారి కన్నీరుమున్నీరు కావడం గమనార్హం. మైనింగ్ పోర్టల్ సర్వర్‌లోని ఐడీలను కూడా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గనులశాఖ మంత్రిని కలిస్తే, నెల్లూరు జిల్లా యువ నాయకుడిని కలవమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక కూటమి నేతలకు కొందరు గనుల యజమానులు లొంగిపోయినట్లు సమాచారం.
యంత్రాలతో మైనింగ్ చేస్తున్న దృశ్యం
నేతల మధ్య యుద్ధం
గనులన్నింటినీ బడా పారిశ్రామికవేత్త, ప్రజాప్రతినిధికి అప్పగించడంపై తిరుపతి, నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, జనసేన నేతలు కొందరు నేరుగా ‘ముఖ్య’ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వారి నుంచి నామమాత్రపు స్పందన రావడంతో సీఎంఓ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. సీఎంఓ అధికారులు మాత్రం ‘గనులన్నింటినీ ఆ ఎంపీకి అప్పగించేశాం.. ఏమైనా పంచాయితీలుంటే ఆయన వద్దనే తెల్చుకోండి’ అని చెప్పినట్లు తెలిసింది.
కూటమిలో మైనింగ్ చిచ్చు
టీడీపీ ఎంపీకి మైకా గనుల అప్పగింత
చక్రం తిప్పిన ఇద్దరు ‘ముఖ్య’ నేతలు
తమకే కేటాయించాలని తిరుపతి జిల్లా తమ్ముళ్ల పట్టు
వాటాల కోసం పట్టుబడుతున్న
జనసేన నేతలు
పంపకాల్లో కుదరని సయోధ్య
Comments
Please login to add a commentAdd a comment