చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
● మినీ లారీ స్వాధీనం
● టీడీపీ నేత చేపల గుంతలకు
తీసుకెళ్తున్నట్లు ప్రచారం
ఉదయగిరి: బెంగళూరు నుంచి కావలికి మినీ లారీలో చికెన్ వ్యర్థాలను తరలిస్తుండగా సోమవారం తెల్లవారుజామున ఉదయగిరి సీఐ ఎన్.వెంకట్రావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దుత్తలూరు మండలం నందిపాడు కూడలిలో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని పట్టుకుని ఉదయగిరికి తరలించారు. బెంగళూరు నుంచి కావలికి చికెన్ వ్యర్థాలు తరలిస్తున్నట్లు లారీలో ఉన్న సిబ్బంది తెలిపారు. 80 డ్రమ్ముల్లో సుమారు పది టన్నుల వ్యర్థాలను గుర్తించి ఉదయగిరి పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద గుంత తీసి అందులో పూడ్చి పెట్టారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఓ నేతకు చెందిన చేపల గుంతలకు ఆ వ్యర్థాలను తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment