బంగారు కడ్డీలతో ఉడాయింపు
నెల్లూరు(క్రైమ్): ఆభరణాల తయారీకి ఇచ్చిన బంగారు కడ్డీలతో తయారీదారుడు ఉడాయించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు తిప్పరాజువారి వీధికి చెందిన పవన్‌కుమార్ జైన్ పెద్ద పోస్టాఫీస్ మాధవపాటి వీధిలో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద కొత్తూరు టైలర్స్ కాలనీకి చెందిన మహ్మద్ ఇంతియాజ్ అనే వ్యక్తి బంగారు కడ్డీలు తీసుకుని కమీషన్ పద్ధతిపై ఆభరణాలు తయారు చేసి ఇచ్చేవాడు. చెప్పిన సమయానికి ఆభరణాలు ఇస్తూ ఎంతో నమ్మకంగా ఉండేవాడు. గతేడాది డిసెంబర్ 21, ఈనెల 2వ తేదీన పవన్ బంగారు ఆభరణాల తయారీ నిమిత్తం 550 గ్రాముల బంగారు కడ్డీలను ఇంతియాజ్‌కు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా అతను ఆభరణాలు తయారు చేసి ఇవ్వలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కొరడావీధిలోని ఇంతియాజ్ దుకాణం వద్దకు వెళ్లగా అది మూసి ఉంది. దీంతో బాధితుడు ఇంతియాజ్ ఇంటికి వెళ్లి ఆరాతీయగా కొద్దిరోజులుగా ఆయన ఇంటికి రావడం లేదని తెలిసింది. దీంతో పథకం ప్రకారమే అతను బంగారంతో ఉడాయించాడని, చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆదివారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
55.688 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 55.688 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరుకు సోమశిల జలాశయం నుంచి 180 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 950, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment