నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎస్సీ నిరుద్యోగులకు సంబంధిత కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇన్‌చార్జి ఈడీ డాక్టర్ ఎ.నిర్మలాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన ఎస్సీలను గుర్తించి నిబంధనల మేరకు రుణాలను అందిస్తామన్నారు. 21 నుంచి 50 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులన్నారు. ఆధార్, కుల, ఆదాయ, తెల్లరేషన్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు తదితర వివరాలతో ఏపీఓబీఎంఎంఎస్ పోర్టల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్లో 316 యూనిట్లు, పశుసంవర్థక శాఖకు సంబంధించి 320 యూనిట్లు, చిన్న తరహా పరిశ్రమలు 380, వ్యవసాయాధారిత సెక్టా ర్‌కు 118 యూనిట్లు అందిస్తామన్నారు. ప్రతి యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ, ఐదు శాతం ల బ్ధిదారుడి వాటా, మిగిలినది బ్యాంక్ రుణం ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment