నెల్లూరు(సెంట్రల్): డ్రిప్, స్ప్రింక్లర్లకు దరఖాస్తు చేసుకొని సర్వే పూర్తి చేసుకున్న రైతులు వారికి సంబంధించిన నగదును ఏపీఎంఐపీకి ఈ నెల 31లోపు చెల్లించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 1444 మంది రైతులు తమ వాటాను చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీనిపై గ్రామాల్లోని వీఏఏలు, వీహెచ్‌ఏలు అవగాహన కల్పించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారానే చెల్లించేలా చూడాలన్నారు. స్పెషల్ డ్రైవ్‌ను వ్యవసా య, ఉద్యానాధికారులు చేపట్టనున్నారని పేర్కొన్నారు.
రహదారి భద్రత
నిబంధనలు పాటించాలి
కందుకూరు: రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలను ఆరికట్టాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని గురువారం నిర్వహించిన వాకథాన్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్న వారే వాహనాలను నడపాలని పేర్కొ న్నారు. మద్యం సేవించి.. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపడం నేరమని చెప్పారు. అనంతరం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి నాగలక్ష్మి మాట్లాడారు. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులను సైతం బాధ్యులుగా పరిగణిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహ కూడలి వద్ద మానవహారం నిర్వహించి జాతీయ రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కందుకూరు మోటార్ వాహనాల తనిఖీ అసిస్టెంట్ రాంబాబు, కావలి ఏఎమ్వీఐ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment