కలెక్టర్ నిర్ణయాలు వివాదాస్పదం
ప్రాథమిక సూత్రాన్ని
విస్మరించారు
రెడ్‌క్రాస్‌లో సభ్యత్వాన్ని తొలగించాలంటే జిల్లాకు ఎలాంటి అధికారాలు ఉండవని.. రాష్ట్ర కమిటీకి మాత్రమే ఉంటాయనే ప్రాథమిక సూత్రాన్ని కలెక్టర్ విస్మరించారని చెప్పారు. రెడ్‌క్రాస్‌ను వాడుకొని సొమ్ము చేసుకునేందుకు మంత్రి యత్నిస్తున్నారని, దీనికి అడ్డంకిగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని కావాలనే తొలగించారని ఆరోపించారు. తప్పును సరిదిద్దుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా ఐదేళ్లు వ్యవహరించానని, సేవాదృక్పథంతో సంస్థకు సేవ చేసిన అంశాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే నెపంతో ఐదుగురి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో కీలకంగా ఉండే విజయ్‌కుమార్‌ను రెడ్‌క్రాస్‌లో సభ్యుడిగా చేర్చి.. దాన్ని నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు(బారకాసు): రెడ్‌క్రాస్ విషయంలో కలెక్టర్ ఆనంద్ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే నెపంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, సుధీర్‌నాయుడు, నేతాజీ సుబ్బారెడ్డి, ప్రసన్నను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారని తెలిపారు. వీరిని తొలగించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మంత్రి నారాయణ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment