గండిపాళెం కాలువకు మరమ్మతులు
ఉదయగిరి: గండిపాళెం కాలువలో చెట్లు, పూడికతీత పనులను రూ.15 లక్షల అంచనా వ్యయంతో గురువారం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టుకు నీరొదిలే పరిస్థితి లేక రైతులు ఇబ్బంది పడుతున్న వైనంపై ‘గండిపాళెం నిర్వహణ గాలికి’ అనే శీర్షికన సాక్షిలో కథనం బుధవారం ప్రచురితమైంది. ఈ తరుణంలో స్పందించిన అధికారులు పనులను చేపట్టారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయకట్టుకు నీరొదులుతామని ఇరిగేషన్ డీఈ చంద్రమౌళి తెలిపారు.
ధాన్యం
కొనుగోలుకు ఏర్పాట్లు
నెల్లూరు(సెంట్రల్): ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చనే అంచనాల నేపథ్యంలో దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. కేంద్రాల వద్ద గ్రామంలోని ఓ ఆదర్శ రైతు, అధికారులు, మిల్లర్ల నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఉండేలా చూడాలని సూచించారు. గోతాలు, ధాన్యం తరలింపు విషయంలో వాహనాలకు కొరత లేకుండా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment