నూర్పిడి ప్రక్రియను పరిశీలించిన ఢిల్లీరావు
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లి క్రాస్‌లో రెడ్స్ స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా ఉత్పత్తిదారుల సంఘం చిరు ధాన్యాల నూర్పడి యంత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు ఆదివారం పరిశీలించారు. కొర్రలు, సామలు, అరికలు, అండుకొర్రలు, రాగుల నూర్పడి విధానాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై సంస్ధ డైరెక్టర్ భానుజాను అడిగి తెలుసుకున్నారు. కొర్రలతో తయారు చేసిన కేక్‌ను కట్ చేసి రుచి చూశారు. తక్కువ ఖర్చుతో చిరుధాన్యాలు సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంట జేడీఏ సుబ్బారావు, కదిరి ఆర్డీఓ ఎస్‌ఎస్ రావు, ఏడీఏలు సనావుల్లా, సత్యనారాయణ, ఏఓలు శ్రీనివాసులరెడ్డి, లక్ష్మీప్రియ, వ్యవసాయ సిబ్బంది, రెడ్స్ సంస్ధ సిబ్బంది, మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు ఉన్నారు.
రైతులతో ముఖాముఖి
కదిరి టౌన్: మండలంలోని కదిరి బత్తలపల్లి గ్రామంలో రైతు గుర్రప్ప సాగుచేసిన చియా పంటను వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు ఆదివారం పరిశీలించారు. అనంతరం గ్రామ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయానికి సంబంధించిన పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment