డ్రోన్ నిఘా
జిల్లాకేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు నేర ప్రభావిత ప్రాంతాల్లో, ముఖ్యంగా గంజాయి సేవిస్తున్న నిర్మానుష్య ప్రాంతాలను గుర్తించేందుకు ‘డ్రోన్ నిఘా’ను ప్రవేశపెట్టినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఫాజుల్‌బేగ్‌పేట్, దత్తాత్రేయ ఆలయం వెనుక భాగాన శ్మశాన వాటిక, నాగావళి నది పరీవాహక పెద్దరెల్లివీధి, డేఅండ్‌నైట్ శ్మశానవాటిక, శాంతినగర్ కాలనీ, నాగావళి రివర్‌వ్యూ పార్కు, రిమ్స్ హాస్పిటల్ వెనుక భాగం, బలగ, డీసీసీబీ మత్స్యశాఖ కార్యాలయం వెనుక భాగం, ఆర్ట్స్ కళాశాల, ఆర్టీసీ కాంప్లెక్సు పరిధి పాడుబడిన బిల్డింగ్స్‌ను డ్రోన్ కెమెరా నిఘాలో ఉంచారు. గంజాయి వినియోగం, పేకాట, కోడి పందాలు, మద్యం మత్తులో అలజడులు సృష్టించడం వంటి అసాంఘిక కార్యకలాపాలే కాక బాలికలపై ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్, చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ వినియోగిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.
– శ్రీకాకుళం క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment