శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Published Tue, Dec 31 2024 1:48 AM | Last Updated on Tue, Dec 31 2024 1:47 AM

శ్రీక

శ్రీకాకుళం

దేహ దారుఢ్య పరీక్షలుకానిస్టేబుల్‌ ఎంపికల్లో దేహ దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు రాణించారు. –8లో
●బహుమతిగా బుజ్జి మొక్క
12:30

బయటపడిన మోసం

నకిలీ బ్యాంకు రశీదుల మోసం బయటపడింది. సీఎఫ్‌ సొంత అవసరాలకు వాడినట్లు తేలింది. 8లో

మంగళవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

గ్రీటింగ్‌ కార్డులు, డైరీలు, క్యాలెండర్లు, పెన్నులు బహుమతులుగా ఇవ్వడం కంటే

ఓ బుజ్జి మొక్కను బహుమతిగా ఇవ్వడం

సబబుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో బోలెడు రకాల పాట్‌ ప్లాంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటి వద్ద అందంగా ఉంచుకునే బోన్సాయ్‌ మొక్కలు కూడా ఇవ్వవచ్చు. నగరంలో లభ్యమవుతున్న బుజ్జిబుజ్జి బోన్సాయ్‌ల ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

నూతన సంవత్సర వేడుకలకు ధర్మాన దూరం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పెద్దపాడులోని క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్ని రద్దు చేశామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్‌సింగ్‌ మృతికి సూచకంగా సంతాపం దినాల్ని పాటిస్తున్నందున వేడుకల్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసేందుకు, వ్యక్తిగతంగా తనను కలిసేందుకు ఎవ్వరూ రావద్దని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలందరికీ నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు.

94 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అర్జీలు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అర్జీలు స్వీకరించారు. 94 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, సర్వే అండ్‌ లాండ్‌ రికార్డులు, ఏపీ టౌన్‌షిప్‌, ఏపీ హౌసింగ్‌, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌, ఏపీఈపీడీసీఎల్‌, పశుసంవర్ధక శాఖ, స్కిన్‌ డెవలప్‌మెంట్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్‌ రిసోర్సెస్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌, సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ రూరల్‌ పావర్టీ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, ట్రెజరీ, దేవదాయ శాఖ, మైన్స్‌ అండ్‌ జియాలజి శాఖలకు సంబంధించి అర్జీ లు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ ిపీడీ కిరణ్‌ కుమార్‌, జడ్పీ సీఈఓ ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌ రాజా ఉండగా, ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 38 వినతులు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం పరి ష్కార వేదిక (ఎస్పీ గ్రీవెన్స్‌)కు అర్జీదారుల నుంచి 38 వినతులు అందాయి. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ముఖాముఖిగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

సీఐ పైడపునాయుడుకు

ఉత్తమ ప్రతిభా అవార్డు

శ్రీకాకుళం క్రైమ్‌ : శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సీహెచ్‌ పైడపునాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 2024 వార్షిక రోలింగ్‌ అవార్డు దక్కింది. సోమవారం మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయంలో సీఐడీ అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌ అయ్యనార్‌, ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ చేతుల మీదుగా ఈ అవార్డును పైడపునాయు డు అందుకున్నారు. విశాఖపట్నంలో సీఐడీ విభాగంలో సీఐగా ఉన్నప్పుడు ఆర్థిక నేరాల ఛేదనలోను, నేరస్తులను పట్టుకోవడంలో పైడపునాయుడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రధానంగా జయలక్ష్మి సొసైటీ కేసు దర్యాప్తు జరిపి రూ. 450 కోట్ల ఆస్తులను సీజ్‌ చేయడంలో పైడపునాయుడు కీలకపాత్ర పోషించడంతో ఈ అవార్డు వరించింది. రాష్ట్రంలో ఈయనతోపాటు మరో ఐదుగురికి అవార్డు రావడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, డీఎస్పీ సీహెచ్‌ వివేకానందలు సీఐకి అభినందనలు తెలిపారు.

మార్కెట్‌కు న్యూ ఇయర్‌ జోష్‌ అభిరుచులకు తగ్గట్టుగా సామగ్రి సిద్ధం

ఫైకాస్‌

వయసు: ఏడున్నర

సంవత్సరాలు

ఖరీదు: రూ.1500

గుబురుగా కాండం మా త్రం పెరుగుతుంది. దీన్ని పూనా నుంచి తీసుకొని వచ్చి అమ్ముతున్నారు.

ప్లాస్టిక్‌ పూల తరం పోయి.. సహజమైన బొకేల సంప్రదాయం వచ్చింది. సాధారణ కేక్‌ల జమానా పోయి థీమ్‌ కేక్‌ల

యుగం రాజ్యమేలుతోంది. సరికొత్త డిజైన్లతో డైరీలు, కొంగొత్త రూపాల్లో గ్రీటింగ్‌ కార్డులు, తీరొక్క రీతుల్లో గిఫ్టులతో

నూతన వత్సర వేడుకకు రంగం సిద్ధమైంది. మార్కెట్‌ నిండా ఇప్పుడు ఈ సరుకే కనిపిస్తోంది. మరోవైపు మొక్కలు

బహుమతిగా ఇచ్చే సత్సంప్రదాయం కూడా కొనసాగుతోంది. ఈ సరదా సందడి నడుమ నూతన ఏడాదికి సరికొత్తగా స్వాగతం

పలకడానికి జనమంతా సన్నద్ధమవుతున్నారు.

ఎడానియం వయసు: 7 ఏళ్లు

ఖరీదు: రూ.1500

బొకే.. లైవ్‌ అయితే ఓకే

ప్లాస్టిక్‌ పలకరింపులకు, ప్లాస్టిక్‌ అభినందనలకు కాలం చెల్లిపోయింది. వీటితో పాటు ప్లాస్టిక్‌ పూల బొకేలు కూడా పాత ట్రెండైపోయాయి. ఓ గుప్పెడు సన్నజాజులు గుదిగుచ్చిన బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు మర్యాద. గులాబీలు గుభాళిస్తుండగా ఆ పూల గుత్తిని తీసుకెళ్లి పలకరించడం గౌరవం. మన బంతి పూలు, రోజాపూలు పాత ట్రెండు కదా.. అని ఫీలయ్యే వారి కోసం బెంగళూరు నుంచి కుసుమాలను తెప్పించి వాటికి మన పువ్వులను జత కలిపి బొకేలు తయారు చేస్తున్నారు. డిజైన్లన్నీ మొహం మొత్తేశాయండీ.. అని అనుకోకుండా ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ కప్పులు, ఫోం, సెలిన్‌ పేపర్‌, రిబ్బన్‌లను ఉపయోగించి అందమైన బొకేలను రూపొందిస్తున్నారు. పూవులను కాదు పండ్లను కూడా అందంగా ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు.

కేక్‌.. ట్రెండీ లుక్‌

అర్ధరాత్రి పూట కేక్‌పై కత్తి పెట్టకపోతే న్యూ ఇయర్‌ వచ్చినట్టే ఉండదు. ఆ కేక్‌లు కూడా సాధారణంగా ఉంటే సెలబ్రేషన్‌ కిక్‌ ఇవ్వదంటున్నారు కొత్త తరం యువకులు. కొత్త ఏడాదికి సరికొత్త డిజైన్‌ కేక్‌తో మాత్రమే స్వాగతం చెప్పాలని నిశ్చయించుకున్నారు. అందుకే వారి అభిరుచికి ఏ మాత్రం తీసిపోకుండా, రుచి ఎంత మాత్రం తగ్గకుండా బ్యాకరీలు ట్రెండీ డిజైన్లతో సిద్ధంగా ఉన్నాయి. రోజంతా రద్దీ ఉంటుంది కాబట్టి.. థీమ్‌ కేక్‌లను ముందుగానే సిద్ధం చేస్తున్నాయి.

క్యాలెండర్‌, డైరీలు సిద్ధం

మార్కెట్‌లో క్యాలెండర్లు, డైరీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఏటికేటా డైరీలు కొంగొత్త హంగులతో తయారవుతున్నాయి. పెద్దవాళ్లకు గిఫ్ట్‌ ఇవ్వడానికి ఈ డైరీలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు రాజ్యమేలిన గ్రీటింగ్‌ కార్డులు కూడా మార్కెట్‌లో కనిపిస్తున్నా యి. గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఓ మధుర జ్ఞాపకంగా పొందిన తరమంతా గ్రీటింగ్‌ కార్డుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు.

కల్చరల్‌ నైట్‌

నగరానికి దూరంగా నూతనంగా నిర్మిస్తున్న ఒక ప్రైవేటు హోటల్‌ యాజమాన్యం నూతన సంవత్సర వేడుకల కోసం టీవీ కమేడియన్‌లతో ఒక షో నిర్వహి స్తున్నారు. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలు మొదల య్యాయి. ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్లు అమ్మకం సాగిస్తున్నారు.

ఎంతోరియం

ఖరీదు: రూ.200

ఈ మొక్కను

గృహ శోభ కోసం

పెంచుకోవచ్చు.

క్లోజింగ్‌

టైమ్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : కొత్త ఏడాదిని స్వీయ భద్రతతో ప్రారంభిస్తామని, మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతే ధ్యేయంగా పనిచేస్తామని, అసాంఘిక, అరాచక శక్తులను అణిచివేస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. నూతన సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్పీ ప్రకటన జారీ చేశారు.

అర్ధరాత్రి 12:30 గంటలకు అన్నీ క్లోజ్‌..

31 అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత రోడ్లపై ఎవరూ తిరగరాదని, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర దుకాణాలు రాత్రి 12:30 గంటలకల్లా మూసేయాల్సిందేనన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, రహదారులపై న్యూ ఇయర్‌ వేడుకలను నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌) వాహనాలు నడపరాదని, సైలెన్సర్లు తీసి పెద్ద శబ్దం చేయరాదని, ర్యాష్‌ డ్రైవింగ్‌, బైక్‌ రేస్‌లు, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే ఊరుకునేది లేదన్నారు. తల్లిదండ్రులు (బంధువులు) మైనర్‌లైన తమ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, కారుల్లో పార్టీల కోసం వచ్చేవారు మద్యం తాగని వారిని డ్రైవర్‌గా పెట్టుకోవాలన్నారు. ప్రతి కూడలిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పై నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు.

అనుమతి తప్పనిసరి..

ఈవెంట్ల నిర్వాహకులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని, లేదంటే చర్యలు తప్పవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్‌ కట్‌ చేయడం, పార్టీలు, డీజే /లౌడ్‌ స్పీకరు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలు చేయడం, డ్యాన్స్‌లు చేసి న్యూసెన్సు క్రియేట్‌ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని, హోటళ్లు, రెస్టారెంట్లలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు ఎలాటి అనుమతులు లేని అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.

గస్తీ గట్టిగా ఉంటుంది..

డిసెంబరు 31 రాత్రి పోలీస్‌ పికెట్స్‌, నైట్‌ గస్తీ బృందాలు అలెర్ట్‌గా ఉంటాయని, అవాంఛనీయ ఘటన లు, ప్రమాదాలు జరగకుండా వాహనాలను తనిఖీ చేస్తారన్నారు. ముఖ్య రహదారి మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. ప్రశాంత వాతావారణంలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలని, ఇళ్ల వద్ద జరుపుకుంటే మరింత మంచిదని తెలిపారు.

లిప్‌స్టిక్‌ ప్లాంట్‌

ఖరీదు: రూ.200

ఇంటిలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుతుంది.

ఈ ప్లాంట్‌ ఇంట్లో

ఆక్సిజన్‌ లెవెల్స్‌

పెంచుతుంది.

మార్కెట్‌లో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు దొరుకుతున్నాయి. వాటిని కూడా చాలా మంది బహుమతిగా ఇస్తారు. మనకు ఇష్టమైన వాళ్లకి మంచి మంచి స్ఫూర్తివంతమైన సూక్తులు ఉన్న ఫొటో ఫ్రేమ్‌లు కుడా ఇవ్వవచ్చు.

శ్రీకాకుళం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని 90 శాతం రెస్టారెంట్లలో పలు రకాల ఆఫర్లను యాజమాన్యాలు ప్రకటించాయి. వీటిలో ఎక్కువగా బఫేకు ప్రాధాన్యత ఇస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. రూ.699 నుంచి రూ.1200 వరకు ఆయా మెనూలను బట్టి ధరలు నిర్ణయించారు. శాఖాహార, మాంసాహార రుచులు ఇందులో ఉంటున్నాయి. కొన్ని రెస్టారెంట్లలో సరికొత్త వంటకాలను పరిచయం చేస్తూ మెనూ రూపొందిస్తున్నారు. చిన్న రెస్టారెంట్లలో 10 నుంచి 15 శాతం రాయితీని, ఇంకొందరు కాంబో ప్యాక్‌లు అంటూ రకరకాల వంటకాలతో ధరలను నిర్ణయించి ప్రకటిస్తున్నారు. రూ.400 మొదలు కొని రూ.2,500 వరకు ఈ కాంబో ప్యాక్‌ ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 12.30 గంటల వరకు నిర్వహించేందుకు అధికారులు వెసులు బాటు కల్పించగా అందుకు తగ్గట్టుగా వ్యాపారులు సిద్ధం అవుతున్నారు.

లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేయాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పింఛన్‌దారులు వారి లైఫ్‌ సర్టిఫికెట్లను సమ ర్పించాలని ఖజానా శాఖ డీడీ సీహెచ్‌ రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వారి లైఫ్‌ సర్టిఫికెట్లను 2025 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 లోగా అందజేలని తెలిపారు. నేరుగా, లేదా ఆన్‌లైన్‌ ద్వారా అందజేయవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో సీఎఫ్‌ఎంలోని పింఛన్‌ లాగిన్‌ ద్వారా ఎన్‌ఐసీ జీవన్‌ ప్రమాణ్‌ ద్వారా సబ్మిట్‌ చేయాలని తెలిపారు. సకాలంలో లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే మార్చి తర్వాత పింఛన్‌ నిలిచిపోతుందన్నారు. ఇప్పటి వరకు పింఛన్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ అందజేయని వారు దగ్గరలో ఉన్న సబ్‌ ట్రెజరీ ఆఫీసులో అందజేయాలన్నారు. నేరుగా అందజేయలేని వారు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే అందులో ఎన్‌ఐసీ జీవన్‌ ప్రమాణ యాప్‌ అలాగే ఆధార్‌ ఫేస్‌ రికగ్నైజర్‌ యాప్‌ లను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఇంటి వద్దనే లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయవచ్చునని తెలిపారు.

రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్ర పండుగగా ప్రకటించిన అరసవల్లి రథసప్తమి వేడుకలను జిల్లా సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శోభాయాత్రతో ప్రారంభమై, సంప్రదాయ క్రీడలు, లేజర్‌షో, బాణసంచా, సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయని, లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ వేడుకల కోసం శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని నిర్ణయించారు. ప్రధాన కూడళ్లలో బ్యూటిఫికేషన్‌ కార్యక్రమాలు చేపట్టాలని, ఫౌంటేన్లు నిర్మించాలని సూచించారు. రథసప్తమి వేడుకలు జిల్లా ప్రతిష్టను పెంచుతాయని, ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు.

ఈవీఎం గోడౌన్ల తనిఖీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్లు భద్రపరిచే గోడౌన్‌ను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లు, ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో కలెక్టర్‌ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ప్రతీ త్రైమాసికంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

న్యూస్‌రీల్‌

ఇవి కూడా..

తిందాం హాయిగా..

– శ్రీకాకుళం కల్చరల్‌

అసాంఘిక కార్యకలాపాలకు ప్పాలడితే ఊరుకోం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

బొకేలకు డిమాండ్‌

ఏటా ఈ సీజన్‌లోనే ఎక్కువగా బొకేల అమ్మకాలు జరుగుతాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా మేము బెంగళూరు నుంచి పూలను తెప్పించుకొని బొకేలను సిద్ధం చేస్తున్నాం.

– యాగాటి ప్రసాద్‌, ఫ్లవర్‌ స్టాల్‌ నిర్వాహకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీకాకుళం1
1/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం7
7/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం8
8/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం9
9/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం10
10/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం11
11/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం12
12/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం13
13/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం14
14/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం15
15/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం16
16/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం17
17/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం18
18/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం19
19/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం20
20/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం21
21/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం22
22/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం23
23/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం24
24/25

శ్రీకాకుళం

శ్రీకాకుళం25
25/25

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement