వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలి
కోదాడ: ఇందిరమ్మ ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని, ఎలాంటి తప్పులు, వివాదాలకు తావివ్వొద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. గురువారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నమోదును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తుదారుల వివరాలను ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేస్తున్నామని, అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పైరవీలకు తావులేదని.. దళారులను ఆశ్రయించొద్దని కోరారు. కలెక్టర్ వెంట కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణ, మున్సిపల్ అధికారులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment