భానుపురి (సూర్యాపేట): జిల్లాలో 15, 16వ తేదీల్లో జరగనున్న గ్రూప్– 2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోదాడ రీజినల్ పరిధిలో 19, సూర్యాపేట రీజినల్‌లో 30 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 16,857 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 15వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు, 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాలుగు దఫాలుగా పరీక్షలు జరగనున్నాయని వివరించారు. పరీక్షలు జరిగే సమయాల్లో అభ్యర్థుల సౌకర్యార్థం బస్సుల సమయాలను మార్చాలని సూచించారు. మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవసరానికై నా అభ్యర్థులు టీజీపీఎస్‌ఈ హెల్ప్‌లైన్ సెంటర్ నంబర్ 040 – 67445566, 040–222335566, కంట్రోల్ రూం నంబర్ 040–24746887,040–24746888ను సంప్రదించాలని కోరారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment