కోదాడ: ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు రూ.2 కోట్లకు ఐపీ (ఇన్‌సాల్వేషన్ పిటిషన్) దాఖలు చేశాడు. కోదాడ పట్టణానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు ఆనంద్‌కుమార్ మొదట రంగా థియేటర్ సెంటర్‌లో, ఆ తరువాత నాగార్జున సెంటర్‌లో ఆనంద్ ఆర్థోపెడిక్ వైద్యశాల ఏర్పాటు చేశాడు. కొంతకాలంగా దాన్ని మూసి వేశాడు. రెండు రోజుల క్రితం ఆనంద్‌కుమార్ కోదాడ సీనియర్ సివిల్ జడ్జి ముందు ఐపీ (నెం:42/2024) దాఖలు చేశాడు. వైద్యశాల నిర్వహణ నిమిత్తం తాను 42 మంది నుంచి రూ.2 కోట్ల అప్పుగా తీసుకున్నానని, వైద్యశాల నిర్వహణలో నష్టం రావడంతో తాను అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment