‘నవోదయ’ను తుంగతుర్తిలో ఏర్పాటు చేయాలి
నాగారం: జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కడియం రామచంద్రయ్య కోరారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రామచంద్రయ్య మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుబడిన ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధికి జిల్లాకు మంజురైన నవోదయ పాఠశాలను తుంగతుర్తి నియోజకర్గంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment