సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ
సూర్యాపేట : సేంద్రియ వ్యవసాయం చేసే ఆసక్తిగల రైతులకు 15 నుంచి 24 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో గల శ్రీ రామచంద్ర మిషన్ శాంతివనం కన్హం గ్రామంలో 10 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామని విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సుభాష్ పాలేకర్ 5 లేయర్ల పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకునే రైతులకు పాలేకర్, విజయరామారావు సమక్షంలో దాదాపు 10 వేల మందికి వసతి, భోజనంతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment