హాస్టళ్లలో కొత్త మెనూ
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ హాస్టళ్లలో ప్రస్తుతం అందించే భోజన మెనూలో మార్పులు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెస్ చార్జీలను 40శాతం, కాస్మొటిక్ చార్జీలను రూ.200కు పెంచిన నేపథ్యంలో ప్రస్తుత మెనూలో మార్పులు చేశారు. శుక్రవారం నుంచి ఈ మెనూ ప్రవేశపెట్టనుండడంతో అన్ని హాస్టళ్లలో వేడుకలు నిర్వహించాలని, ప్రత్యేక అతిథులుగా తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించింది.
తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా..
పండుగ వాతావరణంలో కొత్త మెనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా మొదటి రోజు వారిని పిలిచి భోజనాన్ని రుచి చూపించనున్నారు. ప్రత్యేక అధికారులు సమావేశం నిర్వహించి వారికి వసతులపై వివరించనున్నారు.
ప్రత్యేక అతిథులు వీరే..
జిల్లాలోని గురుకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో నాణ్యమైన మెనూ అందిస్తున్న నేపథ్యంలో మొదటి రోజు ప్రజాప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అడ్డగూడురు హాస్టల్‌కు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి కోదాడ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌కు, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న తుంగతుర్తి ఎస్సీ హాస్టల్‌కు, పర్యాటకశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోదాడ ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహం, వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య దోసహాడ్ బీసీ గురుకుల పాఠశాలలకు ప్రత్యేక అతిథులుగా వెళ్లనున్నారు.
జిల్లాలోని హాస్టళ్లు
కేటగిరి ప్రీమెట్రిక్ పోస్ట్ మెట్రిక్
ఎస్సీ 32 06
ఎస్టీ 10 08
బీసీ 15 09
గురుకులాలు
మైనార్టీ రెసిడెన్షియల్ 04
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 08
బీసీ గురుకులాలు 06
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 03
వారం ఉదయం మధ్యాహ్నం రాత్రి
సోమ పులిహోర, సాంబార్, అరటిపండు రైస్ పాలకూర పప్పు రైస్, వెజిటబుల్ కర్రీ, సాంబారు, మజ్జిగ గుడ్డు
మంగళ కిచిడి, సాంబార్, అరటి పండు రెస్ పాలకూర పప్పు రైస్, వెజిటబుల్ కర్రీ, సాంబారు, మజ్జిగ, గుడ్డు
బుధ టమాట రైస్, సాంబారు రైస్, వెజిటబుల్ కర్రీ రైస్, చికెన్ కర్రీ, బట్టర్‌మిల్క్, సాంబారు
గురు పులిహోర, సాంబారు, అరటిపండు రైస్, పాలకూర పప్పు రెస్, వెజిటబుల్ కర్రీ, సాంబారు, మజ్జిగ, గుడ్డు
శుక్ర కిచిడీ, సాంబారు రైస్, పాలకూర పప్పు రైస్, వెజిటబుల్ కర్రీ, సాంబారు, మజ్జిగ, గుడ్డు
శని జీరా రైస్, సాంబార్ రైస్, వెజిటబుల్ కర్రీ రైస్, పాలకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, సాంబారు
ఆది ఉప్మా, సాంబారు రైస్, వెజిటబుల్ కర్రీ బగారా రైస్, చికెన్ కర్రీ, మజ్జిగ, సాంబారు
పండుగ వాతావరణంలో నేడు డైట్ ప్రారంభం
ఫ తల్లిదండ్రులు,
విద్యార్థులతో సమావేశాలు
ఫ ప్రతి హాస్టల్‌కు ప్రజాప్రతినిధితోపాటు స్పెషల్ ఆఫీసర్ నియామకం
డైట్ చార్జీలు ఇలా (రూపాయలలో..)
తరగతి ప్రస్తుత పెంచినవి
చార్జీలు చార్జీలు 3నుంచి 7 వరకు 950 1,330
8నుంచి 10వరకు 1,100 1,540
ఇంటర్ నుంచి పీజీ 1,500 2,100
కాస్మోటిక్ చార్జీలు (బాలికలకు)
3 నుంచి 7వరకు 55 175
8 నుంచి 10 వరకు 75 275
కాస్మోటిక్ చార్జీలు (బాలురుకు)
3 నుంచి 7 వరకు 62 150
8 నుంచి 10 వరకు 62 200
హాస్టళ్లలో అమలుకానున్న నూతన మెనూ
Comments
Please login to add a commentAdd a comment