వృత్తి విద్యా కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు
సూర్యాపేటటౌన్: వృత్తి విద్యా కోర్సులతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డీఐఈఓ భానునాయక్ అన్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరుగుతున్న ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్యా కోర్సు ద్వారా అనేక ఉద్యోగాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, సీనియర్ లెక్చరర్ నిరంజన్‌రెడ్డి, డాక్టర్ సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రోత్సాహకాలు
అభినందనీయం
కోదాడరూరల్: రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులు అందించడం అభినందనీయమని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో కోరమండల్ ఫెర్టిలైజర్స్(గ్రోమోర్) ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. అనంతరం డ్రాలో గెలిచిన వారికి ట్రాక్టర్, బుల్లెట్ బండి అందజేశారు. కార్యక్రమంలో కోరమండల్ సంస్థ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ జీవి.జుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఏ యల్లయ్య, ఏఓ పాలెం రజిని, సీనియర్ మేనేజర్ ప్రసాద్, తిరుమలరెడ్డి ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే
పకడ్బందీగా నిర్వహించాలి
నాగారం : ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ క్షేత్రస్థాయి సర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారికి ఇళ్లు అందేలా చూడాలన్నారు. ఒక్కో సర్వేయర్ రోజుకు కనీసం 25 ఇళ్లు సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ మారయ్య, ఎంఈఓ వాసం ప్రభాకర్, ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో సీడీపీఓ విచారణ
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మూడవ అంగన్‌వాడీ కేంద్రంలో గత కొద్దిరోజులుగా నిర్వహణలోపం, పిల్లల సరుకులు పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం సీడీపీఓ శ్రీవాణి కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కేంద్రం వద్దకు వచ్చిన పిల్లల తల్లిదండ్రులను విచారించి, రికార్డులు పరిశీలించారు. పిల్లలకు అందజేసిన సరుకుల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. సమయపాలన పాటించడంలో టీచర్ నిర్లక్ష్యం వహిస్తోందని విచారణలో తేల్చారు. ఈమేరకు అంగన్‌వాడీ టీచర్ పద్మ, ఆయా సత్యమ్మలకు మెమోలు జారీ చేశారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం సూపర్‌వైజర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో టాయిలెట్‌లో దాచిన కోడిగుడ్లు గుర్తించిన దానిపై నివేదికను ఉన్నతాధికారులకు అంజేస్తామని తెలిపారు. వీరి వెంట ఏసీడీపీఓ సాయిగీత, సూపర్‌వైజర్ అన్నపూర్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment