పన్ను ఎగవేతదారులకు చెక్
ఫ అధికారికంగా ఉన్న ఇళ్ల సంఖ్యకు,
వాస్తవంగా ఉన్న వాటికి వ్యత్యాసం
ఫ ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు
సేకరిస్తున్న మున్సిపల్ అధికారులు
హుజూర్‌నగర్: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రజల నుంచి వచ్చే పన్నులే ఆధారం. చాలా మంది ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని రెండు, మూడు అంతస్తులు నిర్మించడం, గృహ సముదాయాల్లో వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అలాంటి వాటిని గుర్తించి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా దుకాణాలకు కొలతలు తీసి ఆన్‌లైన్ ద్వారా వ్యాపార లైసెన్స్ ఇవ్వడంతో పాటు పన్ను విధించి సంబంధిత పత్రాలను వారికి అందజేస్తున్నారు.
వ్యత్యాసాలను గుర్తించిన అధికారులు..
మున్సిపాలిటీల్లో అధికారుల లెక్కల ప్రకారం ఉన్న ఇళ్లకు, వాస్తవంగా ఉన్న వాటికి చాలా వ్యత్యాసం ఉండడంతో అధికారులు ఇంటి, దుకాణాల కొలతలను సమగ్రంగా తీసుకుంటున్నారు. సర్వే నిర్వహించగా గతానికి ఇప్పటికీ ఉన్న సంఖ్యలో వ్యత్యాసం వందల్లో ఉన్నదని తేలింది. ఇందులో రెండు, మూడు అంతస్తులున్న యజమానులు, పెద్దభవనాలు నిర్మించుకున్న వారు, తమకు ఇల్లు ఒకటే ఉందని చెప్పి పన్ను కట్టని వారు కూడా కొందరు ఉన్నారని తేలింది. ఈ సర్వేతో వీరంతా ఇక నుండి పన్ను చెల్లించడం తప్పనిసరిగా మారింది.
పరిశీలన తర్వాత పన్ను వసూలు
ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు, మొత్తం ప్లాట్ విస్తీర్ణం, ఎంతమేర గృహాన్ని నిర్మించారు. ఖాళీ స్థలం ఎంత ఉంది. యజమాని పేరు, ఇంటి నంబరు, కాలనీ పేరు, తదితర వివరాలను మున్సిపల్ అధికారులు భువన్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ వివరాలు సీడీఎంఏ నుంచి ఆర్‌ఐ లాగిన్‌లోకి, అక్కడి నుంచి కమిషనర్ లాగిన్‌లోని వెళ్తాయి. కమిషనర్ వరిశీలన పూర్తి కాగానే పన్ను వసూలు చేస్తారు.
సర్వే నిర్వహిస్తున్నాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ పట్టణంలో సర్వే నిర్వ హిస్తున్నాం. ఈ ప్ర క్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆయా అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం భువన్ యాప్‌లో నమోదు చేస్తున్నాం. ఈ సమాచారం నేరుగా సీడీఎంఏకు వెళ్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రారంభిస్తాం.
– శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్
మున్సిపాలిటీల్లో చేపట్టిన సర్వే వివరాలు ఇలా..
మున్సిపాలిటీలు నివాస వాణిజ్య నివాసంలోనే
గృహాలు దుకాణాలు దుకాణం కలిగి ఉన్నవి
సూర్యాపేట 30,755 1,673 2,896
కోదాడ 15,511 683 906
హుజూర్‌నగర్ 7,382 526 399
నేరేడుచర్ల 3,521 320 82
తిరుమలగిరి 5,966 840 340
Comments
Please login to add a commentAdd a comment