అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం
హుజూర్‌నగర్ (చింతలపాలెం): అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చింతలపాలెంలో రూ.20 కోట్లతో మల్లారెడ్డిగూడెం, రేవూరు నుంచి రామాపురం వరకు చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని సాగు, తాగు నీరు, రోడ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ముందుంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. రూ.10 కోట్లతో చౌటపల్లి నుంచి మేళ్లచెరువు వరకు 7 కిలోమీటర్ల డబుల్ రోడ్డు, రూ.26 కోట్లతో లింగగిరి నుంచి కల్మల చెరువు వరకు 13 కి.మీ డబుల్ రోడ్డు, రూ.23 కోట్లతో అమరవరం నుంచి అలింగాపురం వరకు 11.50 కి.మీ డబుల్ రోడ్లు మంజూరయ్యాయని త్వరలో శంకుస్థాపన చేస్తానని పేర్కొన్నారను. తొలుత మంత్రి ఉత్తమ్‌కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారాం, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, నాయకులు నరాల కొండారెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, మోర్తాల సీతారెడ్డి, యరగాని నాగన్న గౌడ్, శాంగరెడ్డి గోవిందరెడ్డి, కొట్టే సైదేశ్వరరావు, శెట్టి రామచంద్రయ్య, రాములు, సైదులు, అధికారులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment