ఇథనాల్ కంపెనీ నిర్మాణం నిలిపివేయాలి
మోతె: ప్రజల ప్రాణాలు మంట గలిపి రైతుల పంట పొలాలు బీడు భూములుగా మార్చే ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా పార్టీ కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం మండల శాఖ ఆధ్వర్యంలో రావిపహాడ్ గ్రామం నుంచి కంపెనీ వరకు చేపట్టిన మహా పాదయాత్రను ఆయన ప్రారంభించారు. సీపీఎం జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు మట్టిపెల్లి సైదులు మాట్లాడుతూ.. ఇథనాల్ కంపెనీ ప్రారంభమైతే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతారన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ముల్కూరి గోపాల్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, కిన్నెర పోతయ్య, సోమగాని మల్లయ్య, జంపాల స్వరాజ్యం, దోసపాటి శ్రీను, కాసాని కిశోర్, గుగులోతు కృష్ణ, కొండ భాస్కర్, పొడపంగి ఈదయ్య, ఎలుగు మధు, కోడి లింగయ్య, కొప్పు వెంకన్న, పగిళ్ల సంగయ్య, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రావిపహాడ్ గ్రామం నుంచి కంపెనీ వరకు సీపీఎం నాయకుల పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment