చీఫ్ సూపరింటెండెంట్ల పాత్ర కీలకం
సూర్యాపేటటౌన్: జిల్లాలో 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్ల పాత్ర కీలకమన్నారు. సూర్యాపేటలో 30 సెంటర్లు ఏర్పాటు చేశామని, అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశులు, చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.
పరీక్షలకు పటిష్ట బందోబస్తు
గ్రూప్ 2 పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు శుక్రవారం తెలిపారు. కేంద్రాల సమీపంలో జీరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్లు, చుట్టు పక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలని సూచించారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment