ఫౌండేషన్ ద్వారా కొత్తవారికి అవకాశం
తనలాగా అవకాశాలు లేకుండా ఎవరూ బాధపడొద్దని చరణ్ అర్జున్ కల్చరల్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులు కనకవ్వ, వల్లాల వాణక్క, నల్లగొండ గద్దర్, భిక్షమమ్మ, వీహా, మహాతి, సంజయ్ మహేష్ లాంటి కొత్త వారిని పరిచయం చేశాడు. ప్రతిభ, నైపుణ్యం ఉన్న వారిని వెలికి తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాకుండా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల చరణ్ అర్జున్ (సీ) టీమ్‌ను ప్రారంభించాడు. గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, వ్యాపారస్తులు, వివిధ హోదాల్లో ఉన్న వారిని సమన్వయం చేసుకుని యువతకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే అభిలాషతో ముందుకెళ్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment