తెరమీద నటనకు అనుగుణంగా తెరవెనుక సాగే సంగీతం వీనుల విందుగా ఉండాలి. అందుకు అనుగుణంగానే చరణ్ అర్జున్ చిన్నప్పటి నుంచి సాధన చేశాడు. పాటలంటే అభిమానం పెరిగి మ్యూజిక్ కోర్సులు పూర్తి చేశాడు. సినిమాల్లో వచ్చిన చిన్న చిన్న అవకాశాలు సద్వినియోగపర్చుకున్నాడు 2014లో సొంత ఖర్చులతో సినిమా తీశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. ఆ తర్వాత అవకాశం రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా స్వయంగా రాసిన, ట్యూన్ చేసిన పాటలను యూ ట్యూబ్‌లో పెట్టాడు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో చరణ్ అర్జున్ ప్రజల్లోకి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 50 వరకు పాటలను అప్‌లోడ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment