కృషి, పట్టుదలే పదాలు..చరణాలు
రూ.22లక్షలు చోరీ
గుర్తుతెలియని దుండగులు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగులగొట్టి రూ.22 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
ఫ మేసీ్త్ర కుటుంబం నుంచి మ్యూజిక్ డైరెక్టర్
- 8లో
పాటంటే అతనికి ప్రాణం.. చదువుకునే వయస్సు నుంచి పాటలే లోకంగా బతికాడు. సంగీతం నేర్చుకుని సినీ రంగం వైపు అడుగేశాడు. తొలి రోజుల్లో అవకాశాలు రాక ఇబ్బంది పడ్డాడు. సొంతంగా సినిమా తీసి నష్టపోయాడు. అయినా పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే తలంపుతో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి వర్ధమానసంగీత దర్శకుల సరసన చేరి రాణిస్తున్నాడు నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో మేళ్లదుప్పలపల్లికి చెందిన కొండేటి చరణ్ అర్జున్.
– రామగిరి(నల్లగొండ)
నల్లగొండ మండలం కొండేటి మల్లేశం, గోపమ్మ దంపతుల నలుగురు సంతానంలో చరణ్ అర్జున్ పెద్దవాడు. తండ్రి సుతారి మేసీ్త్ర పని చేసేవాడు. చరణ్ అర్జున్ 1 నుంచి 7వ తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలో చదువుకున్నాడు. గట్టుప్పల్‌లో ఇంటర్మీడియట్ చదివి.. ఆ తర్వాత హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్ కోర్సు పూర్తిచేశాడు. తన ప్రతి అడుగులో తన మేనబావ దండెం ప్రవీణ్‌కుమార్ ఉంటారని చెబుతున్నారు చరణ్ అర్జున్.
సంగీత దర్శకుడిగా రాణిస్తున్న
నల్లగొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి వాసి
ఫ విమానం, లగ్గం సినిమాలతో బ్రేక్.. కేసీఆర్ సినిమాతో భారీ హిట్
ఫ పాటల రచనలోనూ రాణిస్తున్న చరణ్ అర్జున్
ఫ ఫౌండేషన్లు స్థాపించి కొత్తవారికి అవకాశాలు.. గ్రామానికి సేవ
Comments
Please login to add a commentAdd a comment