గ్రూప్–2 పరీక్షలకు రెడీ
సూర్యాపేటటౌన్ : గ్రూప్– 2 పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆది, సోమవారం జరగనున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు రెండు పేపర్లు, రెండో రోజు మూడు, నాలుగు పేపర్ల పరీక్షలు జరగనున్నాయి. నిర్దేశించిన పరీక్షల సమయానికంటే అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు బంద్ చేయాలని, అభ్యర్థులు ఆ సమయంలోగా కేంద్రాల్లోకి వెళ్లాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, అదనపు కలెక్టర్‌ల నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి సూచనలు చేశారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలు జారీచేశారు. టీజీపీఎస్సీ నిబంధనలు విధిగా పాటించాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులంతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, వైద్య సమస్యలు తలె త్తకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని పలు సెంటర్లలో అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు వేశారు.
పరీక్ష రాయనున్న 16,857 మంది అభ్యర్థులు
కోదాడ రీజినల్ పరిధిలో 19, సూర్యాపేట రీజినల్‌లో 30 పరీక్ష కేంద్రాల్లో ఇలా మొత్తం 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 16,857 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, శాఖాపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్ష పత్రాలను బందోబస్తు నడుమ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది.
గంటన్నర ముందు నుంచే..
ఉదయం పరీక్ష 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో పరీక్ష నిర్వహించనున్నారు.ఈ పరీక్షకు అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తరువాత అరగంట సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. ఈ కారణంగా అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లను బంద్ చేస్తారు. ఉదయం 9:30 గంటల తరువాత, మధ్యాహ్నం 2:30 గంటల తరువాత వచ్చే వారిని అనుమతించరు.
ఇవీ సూచనలు
ఫ పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో రాకూడదు.
ఫ వాచ్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవి తీసుకురావొద్దు.
ఫ బూట్లు వేసుకొని రావొద్దు
ఫ హాల్ టికెట్ మీద ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో విధిగా అతికించుకొని ప్రభుత్వం జారీచేసిన ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తీసుకొనిరావాలి.
నిర్దేశించిన సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
గ్రూప్ –2 పరీక్షలకు సంబంధించి కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ , ఇంటర్‌నెట్ సెంటర్స్ మూసివేయాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి సెంటర్‌కు ఓ పోలీస్ సిబ్బందిని నియమించాం. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. నిర్దేశించిన సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాసుకోవాలి.
– నాగేశ్వర్‌రావు, ఏఎస్పీ
నేడు, రేపు పరీక్షలు
ఫ సూర్యాపేటలో 30,
కోదాడలో 19 కేంద్రాలు
ఫ హాజరుకానున్న
16,857 మంది అభ్యర్థులు
ఫ అరగంట ముందే పరీక్ష కేంద్రాల
గేట్లు మూసివేత
Comments
Please login to add a commentAdd a comment