త్వరలోనే వికలాంగులకు రూ.6వేల పింఛన్
భానుపురి (సూర్యాపేట) : త్వరలోనే వికలాంగులకు రూ.6000 పింఛన్ అందుతుందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో–ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో ఆయనను వికలాంగుల సంక్షేమ సంఘాలు కలిసిన సందర్భంగా మాట్లాడారు. వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికలాంగులకు నెలవారి పెన్షన్ అందించడమే కాకుండా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 100 రోజుల పని దినాలు కల్పించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వికలాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా పూల
రవీందర్‌ను గెలిపించాలి
సూర్యాపేటటౌన్ : ఎమ్మెల్సీగా పూల రవీందర్‌ను గెలిపించాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరేసి చెన్నయ్య కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ రిపోర్ట్ తెప్పించి తక్షణమే అమలు చేయాలని కోరారు. సమావేశంలో పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు అంకతి వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పులుసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు కొత్త బస్సులు
మంజూరు
నల్లగొండ రూరల్: నల్లగొండ డిపోకు ఆరు కొత్త బస్సులు మంజూరైనట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జానిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంజూరైన బస్సులను దేవరకొండ నుంచి మల్లేపల్లి, ముష్టిపల్లి, మర్రిగూడ, శివన్నగూడెం, చౌటుప్పల్, వలిగొండ నుంచి యాదగిరిగుట్టకు, మరో బస్ దేవరకొండ నుంచి మల్లేపల్లి, రేవల్లి, నాంపల్లి, మాల్ నుంచి హైదరాబాద్‌కు నడపనున్నట్లుపేర్కొన్నారు. అలాగే ఇంకో బస్సును దేవరకొండ నుంచి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, చండూరు మునుగోడు, కంచనపల్లి నుంచి నల్లగొండ వరకు, మరో రెండు బస్సులను నల్లగొండ నుంచి మునుగోడు, చొల్లేడు, చౌటుప్పల్, శివన్నగూడెం, మర్రి గూడ, మాల్, మరో బస్సును నల్లగొండ నుంచి మునుగోడు, వెల్మకన్నె, శివన్నగూడెం, లో యపల్లి, రంగాపూర్, ఇబ్రహీంపట్నం వరకు, ఆరో బస్సును నల్లగొండ నుంచి కనగల్, చండూరు, లెంకలపల్లి, మర్రిగూడ నుంచి మాల్‌కు నడపనున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment